News January 20, 2025

పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్

image

AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు.

Similar News

News January 20, 2025

బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

image

రేపు నల్గొండలో BRS చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు, విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు.

News January 20, 2025

ఈ సమయంలో బయటకు రాకండి: డాక్టర్లు

image

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ, వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం, రాత్రి విపరీతమైన చలి ఉంటోంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 18 డిగ్రీల వరకు ఉంటోంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.

News January 20, 2025

ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు: లోకేశ్

image

పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేశ్ స్విస్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. జ్యూరిచ్‌లో వారితో భేటీ అయిన లోకేశ్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ, విశాలమైన రోడ్లు, తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.