News September 19, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

Similar News

News September 19, 2025

సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్.. చాలామందిని విచారించి కీలక సమాచారం సేకరించింది. అటు ఇప్పటికే కాళేశ్వరం కేసును విచారించాలని CBIకి లేఖ రాసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసునూ అప్పగించాలనుకోవడం వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News September 19, 2025

ASIA CUP: భారత్ స్కోర్ ఎంతంటే?

image

ఒమన్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును ఆగనివ్వలేదు. శాంసన్ 56, అభిషేక్ 38, తిలక్ 29, అక్షర్ 26 రన్స్ చేశారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, కలీమ్, జితెన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మరి ఒమన్‌ను IND ఎన్ని పరుగులకు కట్టడి చేస్తుంది? COMMENT

News September 19, 2025

SC అభ్యర్థులకు TSLPRB గుడ్‌న్యూస్!

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC అభ్యర్థులకు TSLPRB ఊరటనిచ్చింది. కొత్త సబ్-క్లాసిఫికేషన్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో ప్రస్తుతానికి పాత వాటితోనే అప్‌లోడ్ చేయొచ్చని తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్తవి సమర్పించాలంది. లేకపోతే రిజర్వేషన్ వర్తించదని హెచ్చరించింది. OCT 5 చివరి తేదీ కాబట్టి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.