News April 7, 2025
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

TG: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ కోటాలో అంజిరెడ్డి, మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఎన్నికయ్యారు. ఉ.11 గంటలకు శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా ప్రమాణం చేయిస్తారు. దాసోజు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని BRS తెలిపింది.
Similar News
News April 9, 2025
పెళ్లి తర్వాత ఎందుకిలా? సమాజంలో ఏం జరుగుతోంది?

సమాజంలో మితిమీరిన పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు/పురుషులు వివాహేతర సంబంధాలతో భార్యలు/భర్తలను చంపుతున్నారు. కొందరు మహిళలు పేగుబంధాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లలను అనాథలుగా వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోతున్నారు. కొందరు భర్తలే స్వయంగా తమ భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ తల్లి తన కూతురికి కాబోయే భర్తతో వెళ్లిపోయింది. దీనిపై మీ కామెంట్?
News April 9, 2025
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘సీఎం సొంత జిల్లా పాలమూరులో బీజేపీ ఎంపీ గెలిచాడు. రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలోనూ కాషాయ జెండా ఎగిరింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో రేవంత్ ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపే గెలిచింది. సొంతగడ్డపైనే గెలవలేకపోయారు. మీరు బీజేపీని ఆపుతారా?’ అని కౌంటరిచ్చారు.
News April 9, 2025
విమానంలో తోటి ప్రయాణికునిపై మూత్ర విసర్జన!

ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికునిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో మద్యం తాగి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బాధితుడు ఒక MNC కంపెనీకి MD అని తెలుస్తోంది. ఈ విషయంపై ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించగా అతడు నిరాకరించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు చేపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది.