News December 20, 2024

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ మెయిన్ రోల్స్‌లో నటించిన ‘పొట్టేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ గ్రామీణం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25న పొట్టేల్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

Similar News

News January 20, 2026

మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

<>ONGC<<>>కి చెందిన మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అర్హత గల అభ్యర్థులు NATS 2.0 పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. జనవరి 22న అప్రెంటిస్ ఫెయిర్ నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://admin.mrpl.co.in

News January 20, 2026

ఉల్లిలో ఊదారంగు మచ్చ తెగులు – నివారణకు సూచనలు

image

ఉల్లి పంటలో కనిపించే తెగుళ్లలో ఉదారంగు మచ్చ తెగులు ఒకటి. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు ప్రధాన పొలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు రైతులు ముందుగానే లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 20, 2026

హనుమంతుడు ఉన్నచోట..

image

హనుమాన్ ఉన్నచోట అశాంతి, అశుభాలు ఉండవు.
బదులుగా సకల శుభాలు కలుగుతాయి.
ఆంజనేయుడి నామం ఉన్న చోట భయం ఉండదు.
బదులుగా అచంచలమైన ధైర్యం నెలకొంటుంది.
మారుతి కొలువైన చోట నిరాశ, నిస్పృహలకు తావుండదు.
బదులుగా నిరంతర ఉత్సాహం, పూర్తి స్పష్టత వెల్లివిరుస్తుంది.
ఆయనను స్మరించే మదిలో అలసత్వం, అపజయం ఉండవు.
బదులుగా ధైర్యం పెరిగి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.