News January 10, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
Similar News
News January 10, 2025
అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు CRDA టెండర్లు ఆహ్వానించింది. రాజధానిలో రూ.2,816 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉన్నట్లు పేర్కొంది. గ్రావిటీ కాలువ పనులు, కొండవీటి వాగు పనులు, కృష్ణాయపాలెం, శాఖమూరులో రిజర్వాయర్, వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వివరించింది.
News January 10, 2025
విశాల్ త్వరలోనే కోలుకుంటారు: జయం రవి
హీరో విశాల్ అనారోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. కష్టాలను అధిగమించి ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ‘విశాల్ చాలా ధైర్యవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. త్వరలోనే సింహం మాదిరి గర్జిస్తారు’ అని పేర్కొన్నారు. <<15094492>>‘మదగజరాజు’<<>> ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ మాట్లాడటం అభిమానులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.
News January 10, 2025
ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
AP: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. జనరేట్ ఏఐని ఉపయోగించేలా ఫ్లాట్‌పామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.