News February 24, 2025

ఓటీటీలోకి కొత్త సినిమా

image

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.

Similar News

News November 12, 2025

నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

image

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి

News November 12, 2025

పాక్ కోర్టు ఆవరణలో దాడి మా పనే: జమాత్ ఉల్ అహ్రార్

image

పాకిస్థాన్‌లోని కోర్టు ఆవరణలో <<18258453>>పేలుడు<<>> తమ పనేనని నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ షరియా అమలులోకి వచ్చే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ సంస్థ గతంలో TTP అనుబంధ సంస్థగా ఉంది.

News November 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.