News November 22, 2024

OTTలోకి కొత్త సినిమా

image

కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ అందించిన స్టోరీతో వచ్చిన మూవీ ‘బఘీరా’. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నిన్న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో రూ.29 కోట్లు వసూలు చేసింది. తెలుగులో నిరాశపర్చింది.

Similar News

News November 26, 2024

గుడ్ల ఉత్పత్తిలో ఏపీ వెరీ గుడ్

image

AP: FY23లో గుడ్లు, ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో నాలుగు, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచినట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆ కాలంలో 2,78,498 లక్షల గుడ్లు, 10.94 లక్షల టన్నుల మాంసం, 154 లక్షల టన్నుల పాల దిగుబడి సాధించినట్లు తేలింది. 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది.

News November 26, 2024

IPL: తెలంగాణ క్రికెటర్‌కు నో ఛాన్స్

image

IPL-2025 మెగా ఆక్షన్‌లో తెలంగాణ క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో అతను వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. గత సీజన్‌లో CSK అతడిని కొనుగోలు చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటుదామనుకుంటే ఏ జట్టు తీసుకోకపోవడంతో అతనికి నిరాశ ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్‌కు చెందిన ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ భారత U19 జట్టుకూ సెలక్ట్ అయ్యారు.

News November 26, 2024

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

image

TG: ఢిల్లీలో ఉన్న CM రేవంత్ ఇవాళ రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించి, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమయం దొరికితే పార్టీ అగ్రనేతలతోనూ భేటీ అయి, ఎంపీగా గెలిచిన ప్రియాంకకు విషెస్ చెప్పనున్నట్లు సమాచారం.