News November 20, 2024
అర్ధరాత్రి నుంచి OTTలోకి కొత్త సినిమా

ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’లో హీరోగా నటించిన శ్రీమురళి ప్రధాన పాత్రలో సూరీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘బఘీరా’. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తులు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Similar News
News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.
News October 22, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్లో 29, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.