News September 7, 2025

కొత్త సినిమా.. రూ.159 కోట్ల కలెక్షన్లు

image

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ ఉమెన్ కథాంశంతో తెరకెక్కిన ‘కొత్త లోక’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ 10 రోజుల్లోనే రూ.159+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.74 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.10.15 కోట్లు వసూలు చేసిందని వెల్లడించాయి. ఇప్పటికే రెట్టింపు లాభాలు వచ్చాయని పేర్కొన్నాయి. ఈ సినిమాకు హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించారు.

Similar News

News September 7, 2025

రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

News September 7, 2025

కవయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం

image

కవయిత్రి, కాలమిస్ట్‌ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ పురస్కారం వరించింది. ఈ మేరకు అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ఆమెకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైనందుకు రమాదేవికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

News September 7, 2025

రాష్ట్రంలో కొత్త పార్టీ?

image

TG: రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్(BCUF) పేరుతో MLC తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ నెల 17న విధివిధానాలు ప్రకటించి, జెండా ఆవిష్కరణ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.