News March 18, 2025
OTTలోకి కొత్త సినిమాలు

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగులో ఈనెల 14న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే OTT బాట పట్టింది. ఈనెల 21 నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
Similar News
News March 19, 2025
సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.
News March 19, 2025
చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దుపెట్టిన ఫొటో వైరలవుతోంది. రేపు UK పార్లమెంట్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కు ఘనస్వాగతం లభించగా, ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. కాగా, ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ అని ఆ అభిమాని కొడుకు ట్వీట్ చేశారు.
News March 19, 2025
IPL: మిడిలార్డర్లో KL బ్యాటింగ్?

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.