News April 24, 2025
OTTలోకి కొత్త సినిమాలు

ఇటీవల థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు OTTలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ పార్ట్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’ జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్ థీఫ్’ అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News April 24, 2025
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా: రెహమాన్

తన విడాకుల సమయంలో ట్రోల్ చేసిన వారిపై ఎలాంటి కోపం లేదని, వారిని తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని AR రెహమాన్ అన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్నారు. ఒకరిపై మనం చెడు ప్రచారం చేస్తే మన గురించి మరొకరు తప్పుగా చెబుతారని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినప్పుడు మనకూ ఓ కుటుంబం ఉందనే ఆలోచనతో ఉండాలని సూచించారు.
News April 24, 2025
1000 మంది మావోలు.. చుట్టుముడుతున్న బలగాలు!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో సుమారు 1000మంది మావోలను 20వేలమంది భారత బలగాలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్‌గా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు మావోయిస్టులకు చావు దెబ్బ తగలొచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎన్‌కౌంటర్లో ఐదుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తోంది.
News April 24, 2025
కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు పెడుతోంది: కేటీఆర్

TG: KCR పాలనలో పదేళ్లపాటు మురిసిన పల్లె, నేడు కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెడుతోందని KTR విమర్శించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా BRS పాలనలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ పనులను గుర్తుచేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. ‘స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. గ్రామాల్లో కనీస వసతుల్లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు’ అని ట్వీట్ చేశారు.