News November 29, 2024
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్!
TG: లగచర్ల భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ తీసుకురానుంది. ఇందులో టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, వేరే కంపెనీలైతే ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 29, 2024
రిషితేశ్వరి కేసు కొట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.
News November 29, 2024
Stock Market: వీకెండ్లో లాభాలు
స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. Heavy Weight Stocksకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో Sensex 759 పాయింట్ల లాభంతో 79,802 వద్ద, Nifty 216 పాయింట్ల లాభంతో 24,131 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, రియల్టీ, ఆటో, IT, ఫైనాన్స్ రంగ షేర్లు Greenలో ముగిశాయి. Bharti Artl 4.40%, Sun Pharma 2.87%, Cipla 2.63%, M&M లాభపడ్డాయి. Power Grid, Shriram Fin, Hero Motoco, Hdfc Life నష్టపోయాయి.
News November 29, 2024
YCP హయాంలోనే అక్రమ రవాణా: వనమాడి
AP: YCP హయాంలోనే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మొదలైందని MLA వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. YCP మాజీ MLA ద్వారంపూడి ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్నారు. పేదలకు అందజేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా నేపథ్యంలో <<14741555>>వనమాడిపై<<>> పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.