News January 2, 2025

న్యూ ఓర్లాన్స్ ట్రక్కు దాడి ఉగ్రచర్యే: ఎఫ్‌బీఐ

image

నూతన సంవత్సర వేడుకల సమయంలో అమెరికాలోని న్యూ ఓర్లాన్స్‌లో జరిగిన ట్రక్కు దాడిని ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. తొలుత ట్రక్కుతో జనాన్ని ఢీ కొట్టిన నిందితుడు ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దారుణ ఘటనలో 10మంది మృతిచెందగా 35మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.

Similar News

News January 4, 2025

ముసలి తల్లిదండ్రుల్ని నిరాదరిస్తే ఆస్తిహక్కు రద్దు.. మీరేమంటారు?

image

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిరాదరించే కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లుళ్లకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని నిపుణులు అంటున్నారు. వారిని నిర్లక్ష్యం చేసే పిల్లలకు ఆస్తిహక్కును రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నారు. అష్టకష్టాలు పడి పెంచితే, తినీతినక చదివిస్తే, రెక్కలొచ్చాక ప్రేమ సంగతేమో గానీ కనీసం జాలిలేకుండా ముసలి వాళ్లను నిరాదరించే విష సంస్కృతి ఈ మధ్య పెరిగింది. వాళ్ల తిక్కను ఈ తీర్పు కుదిరిస్తుందా?

News January 4, 2025

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలు విషయాలపై చర్చించనున్నారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని పేదలకు జీవన భృతి వంటి విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News January 4, 2025

దేశంలో ఎడమ చేతి వాటం కలిగిన వారెందరంటే?

image

క్లాసులో వంద మంది ఉంటే అందులో ఒకరో, ఇద్దరో ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులుంటారు. అంటే, ఇలాంటి స్పెషల్ వ్యక్తులు చాలా అరుదన్నమాట. భారతదేశ జనాభాలో వీరు 5.20శాతం మంది ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 13.10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండగా 12.80శాతంతో కెనడా రెండో స్థానంలో ఉంది. UKలో 12.24%, ఫ్రాన్స్‌లో 11.15%, ఇటలీలో 10.51%, జర్మనీలో 9.83శాతం మంది ఉన్నారు. మీకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఉన్నారా?