News September 20, 2025

కృష్ణా జలాలపై కొత్త పంచాయితీ!

image

కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 అడుగులకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల TGకి నష్టం జరుగుతుందని, CM రేవంత్ ఎందుకు నోరు విప్పడం లేదని KTR ప్రశ్నించారు. అటు AP అసెంబ్లీలో MLA సోమిరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 130 TMCల కృష్ణా జలాలను మళ్లించేందుకు KA 1.33L ఎకరాల భూసేకరణ చేసి, ₹70,000Cr ఖర్చు చేయాలనుకుంటోందని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

image

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.

News September 20, 2025

మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

image

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.

News September 20, 2025

ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

image

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.