News August 29, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ ఫారం

నిర్ణీత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల కోసం కొత్త సరళీకృత పెన్షన్ దరఖాస్తు ఫారం 6-Aని శుక్రవారం విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిసెంబర్ 2024లో, ఆ తర్వాత పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ఫారం భవిష్య/E-HRMSలో అందుబాటులో ఉంటుందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 9 రకాల ఫాంలు/ఫార్మాట్‌లను కలిపి ఈ కొత్త పెన్షన్ ఫారం రూపొందించినట్టు తెలిపింది.
Similar News
News March 1, 2025
ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.
News March 1, 2025
సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్

AP: నటుడు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపర్చారు. YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని పోసాని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్ SMలో వైరల్ చేసేవాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే HYDలో ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు.
News March 1, 2025
అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.