News August 5, 2024
త్వరలో కొత్త పెన్షన్లు: భట్టి

TG: కొత్త పెన్షన్లను త్వరలోనే అందజేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులూ ఇస్తామని, ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. చౌకధరల దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని వివరించారు.
Similar News
News March 5, 2026
TODAY HEADLINES

* ఇరాన్ యుద్ధ నౌకపై US దాడి.. 100 మంది మృతి
* AP, TG.. రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
* AP: 30,588 GOVT ఉద్యోగాలు ఇచ్చాం: CBN
* AP: దివ్యాంగులకు ఫ్రీ జర్నీ.. 18న ప్రారంభం
* AP: నెయ్యి సరఫరాలో CBN స్కామ్‌లు: జగన్
* TG: RS అభ్యర్థులుగా సింఘ్వీ, నరేందర్ రెడ్డి
* TG: టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK
* TG: త్వరలో ఢిల్లీకి KCR.. రాజకీయ మిత్రులతో భేటీ?
* సెమీస్‌లో SAపై NZ విజయం.. ఫైనల్‌కు చేరిక
News March 5, 2026
ఏం కొట్టావయ్యా అలెన్..

T20WC సెమీస్‌లో SAపై న్యూజిలాండ్ ఓపెనర్ <<19299856>>ఫిన్ అలెన్<<>> విధ్వంసం సృష్టించారు. 33 బంతుల్లోనే శతకం బాదారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. T20WCలో, ఫుల్ మెంబర్ టీమ్‌పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2016లో ఇంగ్లండ్‌పై గేల్(WI) 47 బంతుల్లో మూడంకెల స్కోర్ బాదారు. ఓవరాల్‌గా T20Iలలో మూడో వేగవంతమైన శతకం. 2024లో సాహిల్(ఎస్టోనియా)vsసైప్రస్‌పై 27 బంతుల్లో, ఫహాద్(తుర్కియే)vsబల్గేరియాపై 29 బాల్స్‌లో సెంచరీ చేశారు.
News March 5, 2026
GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.


