News May 21, 2024
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అనంతరం డిశ్చార్జి సమయంలోనే జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి అమల్లోకి వచ్చిన కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా పత్రాలు ఎక్కడైనా, ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.
News November 20, 2025
ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 20, 2025
ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.


