News November 1, 2024

రేపటి నుంచి కొత్త కార్యక్రమం

image

APలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు VZM(D) గజపతినగరంలో ప్రారంభిస్తారు. రూ.860 కోట్లతో జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. ఇందులో అధునాతన విధానాలు అవలంభించేలా SRM యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Similar News

News November 1, 2024

కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు

image

TG: ఈ నెల 6 నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 80వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 36,559 మంది SGTలతో పాటు 3414 ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు సహా మరికొందరిని ఇందుకోసం వినియోగించనుంది. అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లల్లో ఈ 3 వారాల పాటు ఉదయం 9 నుంచి మ.ఒంటి గంట వరకే క్లాసులు జరుగుతాయి.

News November 1, 2024

వేడి నూనె పాత్ర‌లో ప‌డ్డ ఫోన్.. బ్యాట‌రీ పేలి వ్య‌క్తి మృతి

image

వంట చేస్తూ చేతిలో ప‌ట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న స‌మ‌యంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్ర‌లో ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా బ్యాట‌రీ పేల‌డంతో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియ‌ర్ త‌ర‌లిస్తుండ‌గా సింధ్ న‌దిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.

News November 1, 2024

టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు

image

AP: బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.