News February 12, 2025
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739336180522_367-normal-WIFI.webp)
TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
Similar News
News February 12, 2025
జగన్ మద్యంతో ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్: మంత్రి రవీంద్ర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348401087_1226-normal-WIFI.webp)
AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యేగా సభకు రావొచ్చని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైందని విమర్శించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
News February 12, 2025
సిక్కుల ఊచకోత: కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350843334_1199-normal-WIFI.webp)
1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.
News February 12, 2025
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739349753045_1226-normal-WIFI.webp)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సచిన్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కోహ్లీ 27వేలకు పైగా పరుగులు చేశారు.