News March 3, 2025
కొత్త రేషన్ కార్డులు.. ఇంకెంత దూరం?

TG: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగదీతపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఈ నెల 1న లక్ష కార్డులు <<15572734>>ఇస్తామని చెప్పగా<<>> అమల్లోకి రాలేదు. పరిశీలన ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ విద్యుత్, ₹500కే సిలిండర్ లాంటి పథకాలకు రేషన్ కార్డే కీలకం. దీంతో కొత్త కార్డులు, పాత కార్డుల్లో మార్పుల కోసం 18Lపైనే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News March 3, 2025
మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.
News March 3, 2025
Skypeను షట్‌డౌన్ చేస్తున్న మైక్రోసాఫ్ట్

2025, మార్చి 5 నుంచి Skypeను షట్‌డౌన్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కొవిడ్ టైమ్‌లో తామే తీసుకొచ్చిన Teams వన్ ఆన్ వన్ కాల్స్, గ్రూప్ కాల్స్, ఫైల్ షేరింగ్ సహా దాని కన్నా మెరుగైన ఫీచర్స్ అందిస్తుందని తెలిపింది. యూజర్లు దీనినే ఎక్కువ వాడుతున్నారని పేర్కొంది. VoIP టెక్‌తో వీడియో కాన్ఫరెన్స్, వీడియో టెలిఫోనింగ్, వాయిస్ కాల్స్ ఫీచర్స్ స్కైప్ ప్రత్యేకత. ప్రస్తుతం దీనికి 36m యూజర్లు ఉన్నారు.
News March 3, 2025
మూగజీవాల కోసం.. చేద్దాం ఈ సాయం

వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. పక్షులు, కుక్కలు, పిల్లుల వంటి మూగజీవాలు దాహార్తితో అలమటిస్తుంటాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నీరు దొరకడం వాటికి అసాధ్యం. ఈ నేపథ్యంలో ఇంటి బయట, వీలుంటే ఇంటిపైన బకెట్లు లేదా చిన్న నీటి తొట్టెలను ఏర్పాటు చేసి వాటిలో నీరు నింపితే ఆ ప్రాణుల దాహాన్ని తీర్చినవారిమవుతాం. వాటి ప్రాణాల్ని నిలబెట్టినవారిమవుతాం.