News June 11, 2024
త్వరలో కొత్త రేషన్ కార్డులు.. సన్న బియ్యం: మంత్రి
TG: కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
Similar News
News December 25, 2024
నితీశ్, నవీన్‌కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి
భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News December 25, 2024
రేపు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యే సినీ ప్రముఖులు వీరే!
TG: CM రేవంత్‌తో రేపు ఉ.10 గంటలకు సినీ ప్రముఖులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. వీరిలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్ కూడా ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, రాజనర్సింహ హాజరవుతారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని CM ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News December 25, 2024
అరటి పండు తింటున్నారా?
అరటి, యాపిల్ తినే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో 3 నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అత్యవసర శక్తి అందిస్తాయని పేర్కొన్నారు.