News July 27, 2024

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: భట్టి

image

TG: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ‘రేషన్ కార్డుల జారీపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం. విధివిధానాలు రూపొందిస్తాం. ఆ తర్వాత కొత్త కార్డుల జారీని ప్రారంభిస్తాం’ అని ఆయన ప్రకటించారు. అటు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని.. అందుకోసమే బడ్జెట్‌లో వారికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు.

Similar News

News January 3, 2026

దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!

image

TG: పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఇది ఫిక్స్ అయితే ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌ తిరిగి వస్తారని సమాచారం.

News January 3, 2026

నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

image

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.

News January 3, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.