News July 3, 2024

సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News July 5, 2024

కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు

image

TG: తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారంటూ KCR, BRS పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలపై తక్షణమే లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో సీతక్క డిమాండ్ చేశారు.

News July 5, 2024

రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

image

రెండు మంత్రి పదవులు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఆశించలేదని ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా AP CM చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చని వివరించారు. ఢిల్లీ నుంచి నేరుగా HYD బయల్దేరిన ఆయన రేపు TG CM రేవంత్‌తో భేటీ కానున్నారు.

News July 5, 2024

బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

image

బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.