News May 23, 2024
కాజల్ ‘సత్యభామ’ మూవీకి కొత్త రిలీజ్ డేట్

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. మే 31న రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా జూన్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. అతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తున్నారు.
Similar News
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 18, 2025
‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్‌తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్‌కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.


