News May 25, 2024

ఖరీఫ్ కోసం కొత్త వరి వంగడాలు రెడీ

image

AP: తెగుళ్లు, వైపరీత్యాలను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్ఎల్ఆర్ 3238, ఎంటీయూ 1275, బీపీటీ 3050 రకాలు ఉన్నాయన్నారు. ఈ ఖరీఫ్‌లో బీపీటీ రకాల కోసం 9441721120, ఎంటీయూ రకాలకు 9440441922, ఎన్ఎల్ఆర్ కోసం 9885527227 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 21, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 21, 2025

ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ప్రసారభారతి<<>> 59పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News October 21, 2025

స్వాతంత్య్ర సంగ్రామంలో సువర్ణ అధ్యాయం: ఆజాద్ హింద్ ఫౌజ్

image

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈరోజు ఎంతో కీలకం. 1943లో సరిగ్గా ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, తాత్కాలిక స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. నేతాజీ నాయకత్వంలో వేలాది మంది సైనికులు దేశం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. ‘చలో ఢిల్లీ’ నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయం పుట్టించిన ఈ సైన్యం సాహసాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. *జై హింద్