News March 18, 2024
మొబైల్ నంబర్ పోర్టింగ్‌కు నయా రూల్.. జులై 1 నుంచి అమలు

మొబైల్ నంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ(MNP) విషయంలో ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారడాన్ని నిలిపివేసింది. సిమ్ స్వాప్ పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Similar News
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 5, 2025
‘గచ్చిబౌలి దివాకర్’లా నారా లోకేశ్: YCP

AP: మంత్రి లోకేశ్‌పై YCP సెటైర్లు వేసింది. ‘4 గంటల్లో 4 వేల మంది అర్జీలు వినగలమా? గంటకు వెయ్యి అర్జీలేంటో తెలుసుకోవడం సాధ్యమేనా? మరీ ఇంత జాకీలా? మహా అయితే గంటకు 40 మందివి వినగలం. అలాంటిది లోకేశ్ 4 గంటల్లో 4 వేల మంది అర్జీలు తీసుకుని, విన్నట్టుగా ఈ ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్’ గుర్తుకువస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది.
News November 5, 2025
యూట్యూబ్‌లో నెలకు 6లక్షలు సంపాదిస్తున్న బామ్మ

నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన సుమన్ ధమానే. 70ఏళ్లవయసులో ఆప్లీ ఆజీ అనే యూట్యూబ్ ఛానెల్‌ను మొదలు పెట్టిన ఆమెకు ప్రస్తుతం 17.9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ ఛానెల్లో ప్రధానంగా సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలే ఉంటాయి. ఆమె మనవడు యష్ సాయంతో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టి నెలకు 5-6 లక్షల వరకు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


