News February 20, 2025
1 నుంచి కొత్త రూల్.. పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు

కొత్తగా హెల్త్, లైఫ్ బీమా తీసుకునే వారి సౌలభ్యం కోసం IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ జారీ చేసిన తర్వాతే వినియోగదారుడి ఖాతా నుంచి ప్రీమియం వసూలు చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది. మార్చి 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పాలసీదారులు తమ అకౌంట్లలో మొత్తాన్ని నిలిపివేసుకునేందుకు BIMA-ASBA(అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) సదుపాయాన్ని అందించాలని సూచించింది.
Similar News
News December 11, 2025
మోదీకి నెతన్యాహు ఫోన్

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.
News December 10, 2025
US వెళ్లేందుకు వారు ఐదేళ్ల SM హిస్టరీ ఇవ్వాలి!

UK సహా వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లే వాళ్లు ఇకపై ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. వీసా అవసరంలేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రూల్ తప్పనిసరి చేసేలా US ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుతో యూరప్, AUS, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఖతర్, ఇజ్రాయెల్ వంటి 40 దేశాలపై ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 90 డేస్ అమెరికాలో ఉండొచ్చు.
News December 10, 2025
చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.


