News August 23, 2024
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆ మెసేజ్లపై నిషేధం

SEP 1 నుంచి వినియోగదారులకు APK ఫైల్స్, URL, OTT లింక్లు, బ్లాక్ లిస్టులో ఉన్న కాల్బ్యాక్ నంబర్లతో కూడిన మెసేజ్లు పంపరాదని టెలికం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. మోసగాళ్ల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడం కోసమే ఈ ఆదేశాలు జారీ చేశామంది. అటు SEP 30 నుంచి టెలీ మార్కెటింగ్ నంబర్లు విధిగా ’30 140’తో ప్రారంభం కావాలన్న TRAI.. వ్యక్తిగత నంబర్లతో ఫోన్ చేస్తే రెండేళ్లు నంబర్ బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.
Similar News
News October 25, 2025
పదేళ్లలో టెస్లా మూత పడొచ్చు: కార్లోస్ తవారెస్

ఆటోమొబైల్ రంగం నుంచి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తప్పుకోవచ్చని ఆటో జెయింట్ స్టెల్లాంటిస్ సంస్థ మాజీ CEO కార్లోస్ తవారెస్ అభిప్రాయపడ్డారు. ‘AI, స్పేస్ ఎక్స్, హ్యూమనాయిడ్ రోబోస్ మీద మళ్లీ ఫోకస్ చేసేందుకు మస్క్ టెస్లా నుంచి తప్పుకోవచ్చు. చైనాకు చెందిన BYD సంస్థ జోరు ముందు టెస్లా కంపెనీ ఓడిపోవచ్చు. పదేళ్ల తర్వాత ఎలాన్ మస్క్ కార్ల సంస్థ ఉంటుందని కూడా నేను చెప్పలేను’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
News October 25, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27,28,29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.
News October 25, 2025
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి CBN శ్రీకారం

AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ను CM CBN దుబాయ్లో ప్రారంభించారు. ‘ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది ప్రయోజనం అందిస్తుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా ₹10 లక్షలు అందుతుంది. ఈ పథకంలో నమోదు కావడానికి ‘https://apnrts.ap.gov.in/insurance’ వెబ్ సైట్ను సందర్శించాలి’ అని I&PR సూచించింది.


