News February 27, 2025
కొత్త రూల్.. వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లు మస్ట్!

TG: ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వెహికల్స్కు (కొత్త, పాత) ఈ రూల్ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా TGలో ఇది అమలు కానుంది. ఈ రూల్ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.
Similar News
News December 10, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్

⋆ డైరెక్టర్ సుకుమార్ హానెస్ట్, ట్రాన్స్పరెంట్గా ఉంటారని హీరోయిన్ కృతిసనన్ ప్రశంసలు
⋆ ‘అఖండ-2’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో తమ ‘మోగ్లీ’ సినిమా విడుదలను DEC 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్
⋆ ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపుపై మరో GO జారీ చేసిన AP ప్రభుత్వం.. 11న ప్రీమియర్ల టికెట్ ధర ₹600, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో ₹75, మల్టీప్లెక్స్లలో ₹100 చొప్పున పెంపు
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


