News April 11, 2025
క్రికెట్లో త్వరలో కొత్త రూల్స్!

కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ICC కసరత్తు చేస్తోంది. వన్డేల్లో రెండు కొత్త బంతుల రూల్‌ను సవరించనుంది. దీని ప్రకారం బౌలింగ్ టీమ్ 2 న్యూ బాల్స్‌తో ఆటను ఆరంభించవచ్చు. 25 ఓవర్ల తర్వాత వాటిలో ఒక్క దానినే కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే టెస్టుల్లో ఒక్క రోజులో 90 ఓవర్లు పూర్తయ్యేలా ఓవర్ల మధ్య 60sec మాత్రమే విరామం ఉండేలా టైమర్‌ను తీసుకురానుంది. అటు మెన్స్ U19 WCను T20 ఫార్మాట్‌కు మార్చాలని యోచిస్తోంది.
Similar News
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.
News November 12, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.


