News February 13, 2025

కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

image

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.

Similar News

News February 13, 2025

కల్తీ నెయ్యి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అదేరోజు కోర్టులో హాజరుపరిచారు.

News February 13, 2025

మధురైలో పవన్‌ను కలిసిన OG సినిమాటోగ్రాఫర్

image

తమిళనాడులో పర్యటిస్తున్న Dy.CM పవన్‌ కళ్యాణ్‌ను మధురైలో ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా నందన్‌ను పవర్ స్టార్ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా OG చిత్రాన్ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

News February 13, 2025

వంశీపై ముగిసిన విచారణ.. ఆస్పత్రికి తరలింపు

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణలంక స్టేషన్లో పోలీసుల విచారణ ముగిసింది. 8గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన్ను పీఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి(జీజీహెచ్‌)కు వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!