News July 1, 2024
నేటి నుంచి కొత్త రూల్స్

SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అయితే చెక్/క్యాష్ పికప్, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్‌కు ఛార్జీలను తొలగించింది.
Similar News
News January 14, 2026
NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 14, 2026
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

AP: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.


