News January 1, 2025

నేటి(జనవరి 1) నుంచి కొత్త రూల్స్

image

* శాంసంగ్ గెలాక్సీ S3, మోటో G, HTC 1X, మోటో రేజర్ HD, LG ఆప్టిమస్ G, సోనీ ఎక్స్‌పీరియా Z వెర్షన్లలో వాట్సాప్ పనిచేయదు.
* మారుతీ, హోండా, హ్యుందాయ్, మహీంద్రా, MG, TATA, బెంజ్, ఆడికార్ల ధరలు పెరిగాయి.
* TGలోని APGVB శాఖలన్నీ TGBలో విలీనమయ్యాయి.
* అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఒకేసారి 2 కంటే ఎక్కువ టీవీల్లో వాడేందుకు అవకాశం లేదు. అయితే డివైజ్‌ల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

Similar News

News January 4, 2025

పావురాలను మేపుతున్నారా.. ఈ ప్రమాదం తెలుసా?

image

చాలామందికి పావురాల్ని మేపడం ఓ హాబీగా ఉంటుంది. వారు వేసే మేత కోసం రోడ్డుపై, కరెంటు తీగలపై వందలాదిగా పావురాలు చేరుతుంటాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే క్రిప్టోకోకస్ అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ వంటి వ్యాధులు వస్తాయని.. పలు రోగకారకాలకూ పావురాలు వాహకాలని పేర్కొంటున్నారు.

News January 4, 2025

అకౌంట్లోకి రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. నిన్న ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు.

News January 4, 2025

హైదరాబాద్‌లో తప్పిన విమాన ప్రమాదం

image

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే