News March 5, 2025

IPL-2025లో కొత్త రూల్స్

image

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్‌లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

Similar News

News February 13, 2026

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు-2026

image

>కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు: ధర్మపురి, భీంగల్, పెద్దపల్లి (D) సుల్తానాబాద్, మంథని. కరీంనగర్ (D) చొప్పదండి. మహబూబాబాద్ (D) మరిపెడ, డోర్నకల్‌. భద్రాద్రి (D) అశ్వారావుపేట, ఇల్లెందు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద. ఎల్లారెడ్డి, బాన్సువాడ. సూర్యాపేట (D) హుజూర్‌నగర్, నేరేడుచర్ల, కోదాడ.

>BRS గెలిచిన స్థానాలు: అయిజ, తొర్రూరు, తిరుమలగిరి. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం.

News February 13, 2026

తల్లిపాల గురించి ఈ విషయాలు తెలుసా?

image

తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు.. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలకి పాలివ్వడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయంటున్నారు నిపుణులు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిపాలు శిశువుకు సులువుగా అరగడంతో పాటు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. కాబట్టి తల్లిపాలివ్వడం ముఖ్యమని చెబుతున్నారు.

News February 13, 2026

RR కెప్టెన్‌గా రియాన్ పరాగ్!

image

రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.