News October 4, 2025
కొత్త రూల్స్.. ఇక గంటల్లోనే చెక్కులు క్లియర్

చెక్కులకు సంబంధించి నేటి నుంచి RBI కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో ఒకటి, రెండు పని దినాలు పట్టే చెక్కులు ఇక కొన్ని గంటల్లోనే క్లియర్ కానున్నాయి. చెక్కు ట్రంకేషన్ సిస్టం ఆధారంగా ఈ కొత్త పద్ధతి పనిచేస్తుంది. చెక్కును ఫిజికల్‌గా బ్యాంకుకు పంపాల్సిన అవసరం ఉండదు. దాని ఫొటో, వివరాలు పంపితే వెంటనే క్లియర్ అవుతాయి. అటు చెక్కుల భద్రతను పెంచడానికి పాజిటివ్ పే సిస్టమ్‌ను RBI తప్పనిసరి చేసింది.
Similar News
News October 4, 2025
జురెల్ క్రికెట్ జర్నీ అద్భుతం: దినేశ్ కార్తీక్

<<17904558>>సెంచరీ<<>> హీరో ధ్రువ్ జురెల్ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పారు. ఆయన ప్రయాణం అద్భుతమని కొనియాడారు. కెరీర్ ప్రారంభంలో జురెల్ తల్లి నగలు తాకట్టు పెట్టి క్రికెట్ కిట్ కొనిచ్చారని తెలిపారు. డొమెస్టిక్ టోర్నీల్లో సత్తా చాటి టీమ్ ఇండియాకు ఎంపికయ్యారని గుర్తు చేశారు. తాజాగా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ టెస్టుల్లో తొలి శతకం బాదారని ప్రశంసించారు.
News October 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 25

1. పంచవటి ఏ నదీ తీరాన ఉంది?
2. అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ నపుంసక వేషంలో విరాట రాజభవనంలో ఉన్నాడు?
3. అష్టాదశ పురాణాలను ఎవరు రచించారు?
4. హనుమంతుడు హిమాలయాల్లోని ఏ పర్వతం నుంచి సంజీవని తీసుకొచ్చారు?
5. వ్యాసుడు రచించిన భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయి?
<<-se>>#ithihasaluquiz<<>>
News October 4, 2025
ప్రేమ పెళ్లి.. వారం రోజులకే నవ వధువు సూసైడ్

TG: జగిత్యాల(D) ఎర్దండిలో పెళ్లయిన వారం రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన సంతోష్, గంగోత్రి(22) గత నెల 26న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దసరా రోజున తల్లి ఇంటికి వెళ్లగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గంగోత్రిని సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్య చేసుకుంది. గంగోత్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.