News January 11, 2025
వెలుగులోకి కొత్త మోసం.. ప్రెగ్నెంట్ చేస్తే ₹10లక్షలు!
‘ప్రెగ్నెంట్ సర్వీస్’ పేరిట బిహార్‌లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్‌కు తెరలేపింది. పిల్లల్లేని మహిళల్ని గర్భవతులను చేస్తే ₹10లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా ₹50,000-₹5L ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు. ఆధార్, పాన్, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Similar News
News January 11, 2025
రేపు యువతతో గడపనున్న మోదీ
రేపు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యువతతో గడపనున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రధాని తన Xలో పోస్ట్ చేశారు. యువతతో వివిధ అంశాలపై చర్చించడంతో పాటు వారితో కలిసే భోజనం చేయనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏటా జనవరి 12న నేషనల్ యూత్ డే నిర్వహిస్తారు.
News January 11, 2025
అక్రమ వలసదారుల వెనుక రాజకీయ కోణం
మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యాల వెనుక ఉన్న డాక్యుమెంట్ల ఫోర్జరీ సిండికేట్‌కు రాజకీయ నేతలు, అధికారులు, NGOలతో లింకులు ఉన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ వలసదారులకు ధ్రువపత్రాలు మంజూరు చేసి వారిని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నట్టు వెలుగులోకొచ్చింది. పాస్‌పోర్టులు కూడా పొందుతున్నట్టు తేలింది. ఈ విషయమై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
News January 11, 2025
దారుణం: అథ్లెట్‌పై 60మంది లైంగిక వేధింపులు
కేరళలో దారుణ ఘటన జరిగింది. అథ్లెట్‌గా ఉన్న ఓ బాలిక(18)పై ఐదేళ్ల పాటు 60మందికి పైగా మృగాళ్లు లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. శిశు సంక్షేమ కమిటీ ముందు ఆమె తాజాగా తన గోడును వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగుచూసింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది. 40మందిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.