News April 3, 2024

కొత్త స్కీమ్.. ఈవీ వాహనాలకు రాయితీ ఇలా..

image

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన EMPS కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. జులై 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద రాయితీల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. మొత్తం 3.72లక్షల ఈవీ వెహికల్స్ కొనుగోలును ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద EV బైక్‌లకు రూ.10 వేలు, ఇ-రిక్షా, ఇ-కార్ట్‌లకు రూ.25వేలు, 3 చక్రాల ఈవీలను కొనుగోలు చేసే వారికి రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది.

Similar News

News January 19, 2026

రాణా బ్యాటింగ్ అద్భుతం: సునీల్ గవాస్కర్

image

న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో టీమ్‌ఇండియా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. షార్ట్ పిచ్ బాల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. టీమ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన రాణా చక్కటి ఇన్నింగ్స్ ఆడారని తెలిపారు. రాణా 43 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 రన్స్ చేశారు. 7వ వికెట్‌కు విరాట్‌తో కలిసి 99రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.

News January 19, 2026

బిచ్చగాడి ఆస్తుల చిట్టా.. దెబ్బకు ఆఫీసర్లే షాకయ్యారు!

image

MPలోని ఇండోర్‌లో అధికారులకు షాకిచ్చాడో బిచ్చగాడు. బెగ్గర్లు లేని సిటీగా మార్చాలని డ్రైవ్‌ నిర్వహిస్తుండగా సరాఫా బజార్‌లో మంగీలాల్ అనే వికలాంగుడు కనిపించాడు. ఆరా తీయగా అతడి ఆస్తుల చిట్టా బయటపడింది. 3 ఇళ్లు, 3 ఆటోలు, ఓ కారు ఉన్నాయి. ఆటోలను అద్దెకు తిప్పుతుండగా, కారు కోసం ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. రోజుకు ₹500-1000 భిక్షాటనతో సంపాదిస్తున్నాడు. బంగారు వ్యాపారులకు అప్పు కూడా ఇస్తాడట.

News January 19, 2026

కవిత కొత్త పార్టీకి సన్నాహాలు.. స్ట్రాటజిస్ట్‌గా పీకే

image

TG: జాగృతి చీఫ్ కవిత ఉగాది వేళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. ఇటీవల 5 రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసి కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని ఇద్దరు కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది.