News January 16, 2025
కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
Similar News
News October 23, 2025
మగాడివైతే మాతో పోరాడు.. ఆసిమ్ మునీర్‌కు పాక్ తాలిబన్ల సవాల్

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సవాల్ విసిరింది. తమపైకి సైనికులను పంపడం మానుకుని, ఉన్నతాధికారులే యుద్ధానికి రావాలంటూ వీడియోను రిలీజ్ చేసింది. ‘నువ్వు మగాడివైతే మాతో పోరాడు. తల్లిపాలు తాగుంటే మాతో యుద్ధం చెయ్’ అని ఆసిమ్ మునీర్‌కు TTP కమాండర్ కజీం ఛాలెంజ్ విసిరాడు. కాగా కజీం సమాచారం ఇచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డును పాక్ అధికారులు ప్రకటించారు.
News October 23, 2025
కోత ముప్పు తప్పించేలా తీరం వెంబడి ‘గ్రేట్ గ్రీన్ వాల్’

AP: రాష్ట్రంలోని 1,053 KM తీరం వెంబడి 5 KM వెడల్పుతో ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. మల్టీ లేయర్ గ్రీన్ బఫర్ జోన్లుగా ఇది ఉంటుంది. దీనివల్ల తుఫాన్ల నుంచి తీర రక్షణ, స్థిరమైన మత్స్య సంపద వృద్ధితో 30 లక్షల మంది ఉపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో అంతర్జాతీయ సంస్థల నుంచి, campa, nregsల ద్వారా నిధులు సమకూర్చనున్నారు.
News October 23, 2025
ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు

ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతిని చాటే వారికి ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డును అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25మందిని ఎంపిక చేయగా అందులో డాలీసింగ్ స్థానం సంపాదించారు. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌తోపాటు నటిగానూ పేరు పొందింది.