News January 25, 2025
రేపటి నుంచి కొత్త స్కీమ్స్.. సీఎం కీలక ఆదేశాలు

TG: రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. HYD మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 13, 2025
‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.
News November 13, 2025
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.


