News July 30, 2024

ఎస్సీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి: సీఎం

image

AP: ఎస్సీలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. 2014-2019 మధ్య కాలంలో అమలు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చంద్రన్న పెళ్లికానుక లాంటి పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. వాటితో పాటు మరిన్ని కొత్త పథకాలు రూపొందించాలని ఆదేశించారు.

Similar News

News October 18, 2025

కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

image

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్‌ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.

News October 18, 2025

జైనుల దీపావళి ఎలా ఉంటుందంటే..?

image

జైనులు దీపావళిని ఆధ్యాత్మిక దినంగా పరిగణిస్తారు. ఈరోజునే మహావీరుడు నిర్యాణం పొందిన రోజుగా భావిస్తారు. ఆయన దివ్యజ్యోతికి ప్రతీకగా దీపాలను వెలిగిస్తారు. ఆ కాంతిని మహావీరునికి అంకితం చేస్తారు. ఆయన జ్ఞాన బోధనలను, చూపిన మోక్షమార్గాన్ని స్మరించుకుంటారు. దీపావళిని వారు అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టే.. వ్యాపారాలను ఈ శుభదినం నుంచి ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. నూతన సంవత్సరంగా జరుపుకొంటారు.

News October 18, 2025

డిమాండ్లు తీరుస్తాం… వైద్యులు విధుల్లో చేరాలి: ప్రభుత్వం

image

AP: PHCల వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సూచించారు. PG మెడికల్ ఇన్‌సర్వీస్ కోటాను ఈఏడాది అన్ని కోర్సుల్లో కలిపి 20% అమలుకు GO ఇస్తామని వారితో చర్చల్లో వెల్లడించారు. ట్రైబల్ అలవెన్సు తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే PGలో 15% కోటా 3ఏళ్లు ఇవ్వాలని సంఘం నేతలు కోరగా దీనిపై ప్రభుత్వం నవంబర్లో నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు.