News November 26, 2024
రూ.10వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ పాలసీ: చంద్రబాబు

AP: పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ పాలసీ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దీన్ని రూపకల్పన చేశామన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఎస్సీ, ST, BC, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, రానున్న క్యాబినెట్లో దీనిపై చర్చిస్తామన్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత బాధ్యతలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెను.. సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగం పనిచేస్తూ బదిలీపై WGL సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించబడ్డారు.
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.


