News December 11, 2024
రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ

AP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లను ప్రోత్సహించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ రూపొందించినట్లు వివరించింది.
Similar News
News November 28, 2025
ఖమ్మం: ఎన్నికల విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామ రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
News November 28, 2025
‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్ ఉందా?

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్ లేదు.
News November 28, 2025
మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్ టెస్ట్, అబార్షన్ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్ మేకప్ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.


