News October 11, 2024
NEW TREND క్రోమింగ్.. పేరెంట్స్ జాగ్రత్త!

అమెరికాలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. పేరు క్రోమింగ్. ఇంట్లోని నెయిల్ పాలిష్, మార్కర్లు, బోర్డు డస్టర్లు, మత్తు కలిగించే ఇతర వస్తువుల వాసన పీలుస్తూ వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడమే దీని ఉద్దేశం. గతంలోని హప్ఫింగ్, పప్ఫింగ్, ర్యాగింగ్, బ్యాగింగే ఇప్పుడిలా రూపాంతరం చెందాయి. హైడ్రో కార్బన్స్ను పీల్చే ఈ మాయదారి ట్రెండ్ వల్ల టీనేజర్స్, చిన్నారులు వ్యసనాలు, ఆస్తమా, గుండెజబ్బుల బారిన పడుతున్నారు.
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.


