News May 2, 2024

నయా ట్రెండ్ లోకల్ మేనిఫెస్టో.. ఓట్లు కురిపించేనా?

image

రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తుంటే.. అభ్యర్థులు నియోజకవర్గాల్లో లోకల్ మేనిఫెస్టోలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమస్యలు, దీర్ఘకాలిక డిమాండ్‌లు, అభివృద్ధి ఎజెండాతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నెల్లూరులో విజయసాయిరెడ్డి, గాజువాకలో అమర్నాథ్, విజయవాడ వెస్ట్‌లో సుజనా చౌదరి స్థానిక మేనిఫెస్టోలు ప్రకటించారు. మరి ఈ ఫీట్లు ఓట్లు కురిపిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. <<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 10, 2026

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులు

image

AP: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల వరకు లేదా కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు వీరి పాలన సాగనుంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లు సహా ఇతర సంస్థలకు RDO, JCలను ప్రత్యేక అధికారులుగా నియమించింది.

News March 10, 2026

కాసేపట్లో ఇరాన్‌పై భీకర దాడులు: అమెరికా

image

ఇరాన్‌పై కాసేపట్లో ఎప్పుడు లేనంత స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించారు. తాము అనుకున్న సమయానికే ఇరాన్‌తో యుద్ధం ఆపుతామని తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. మరోవైపు యూఏఈలోనే అతిపెద్దదైన రువాస్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడి జరిగింది. దీంతో రిఫైనరీ తాత్కాలికంగా మూతపడింది.

News March 10, 2026

AP, TG ఎంత అప్పు చేశాయంటే?

image

2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP రూ.56,072Cr, TG రూ.69,300Cr అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP రూ.26,572Cr, TG రూ.17,400Cr, రెండో క్వార్టర్‌లో AP రూ.17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్‌లో AP రూ.11,900Cr, TG రూ.19,400Cr ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.