News December 20, 2024
25 నుంచి థియేటర్లలో ‘పుష్ప 2’ కొత్త వెర్షన్?

‘పుష్ప 2’ కొత్త వెర్షన్ను మేకర్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిడివికి మరో 18 నిమిషాల ఫుటేజ్ కలిపారని, దీనిని ఈ నెల 25 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంది. కొత్త సీన్లు కలిపితే 3 గంటల 38ని. కానుంది. కలెక్షన్లు పెంచేందుకు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రూ.1,500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
Similar News
News December 4, 2025
పంచాయితీ చిచ్చు.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

‘రూపాయి రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పిందట’ ఇది ఆ నలుగురు సినిమాలోని డైలాగ్. ఇప్పుడు రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే.. <<18468452>>తల్లీకూతుళ్లు<<>>, అన్నాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతానని చెబుతుంది. TG పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోన్న దృశ్యమిది. పార్టీలు, నాయకుల పంతాలతో సామాన్య కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై మీ కామెంట్
News December 4, 2025
BREAKING: సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

AP: 2026కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి(ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి(అక్టోబర్ 18), దీపావళి(నవంబర్ 8) ఆదివారం వచ్చాయి. పైన ఫొటోల్లో సెలవుల లిస్టును చూడొచ్చు. వీటిని బట్టి మీ ట్రిప్స్ను ప్లాన్ చేసుకోండి.
News December 4, 2025
సింగపూర్ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

AP: గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


