News November 29, 2024
కొత్త వర్టికల్ సీ బ్రిడ్జ్ రెడీ: అశ్వినీ వైష్ణవ్

భారతదేశ మొట్టమొదటి వర్టికల్(నిలువు) లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ, ఫొటోలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది తమిళనాడులోని మండపం, రామేశ్వరం ద్వీపం మధ్యలో ఆకాశనీలం జలాల్లో విస్తరించి ఉంది. ఈ అద్భుతమైన అత్యాధునిక సాంకేతికత అబ్బురపరుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, 1914లో నిర్మించిన పాత పంబన్ వంతెన తుప్పుబట్టడంతో 2022లో మూసివేశారు.
Similar News
News March 26, 2026
అంతరాయం లేకుండా ఇంధన సరఫరా: కేంద్రం

దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు సరిపడా సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రతి సిటిజెన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా ఆయిల్ ఉందని వెల్లడించింది.
News March 26, 2026
రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.
News March 26, 2026
మా అనుభవాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం: సైనా నెహ్వాల్

తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించి బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ గతేడాది వార్తల్లో నిలిచారు. అయితే కొన్నాళ్లకే కలిసిపోతున్నట్లు వెల్లడించారు. దీనిపై సైనా తాజాగా స్పందించారు. ‘బంధాల్లో విభేదాలు సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటామనేదే అత్యంత ముఖ్యం. కమ్యూనికేషన్, నమ్మకం, పరస్పర గౌరవం, సహనం అవసరం. మా అనుభవాల నుంచి మేం నేర్చుకుంటూనే ఉన్నాం’ అని NDTV ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


