News December 31, 2024
NEW YEAR వేడుకలకు సిద్ధమైన కరీంనగర్!

కొత్త సంవత్సరం వేడుకలకు కరీంనగర్ సిద్ధమయింది. నేటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో ఇప్పటికే నగరంతో పాటు.. గ్రామాల్లో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో నగరం మెరిసిపోతుండగా.. ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావారణం కనిపిస్తోంది. మరి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News December 19, 2025
కరీంనగర్లో ఈనెల 24న కిసాన్ గ్రామీణ మేళా

డిసెంబర్ 24 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ గ్రామీణ మేళా అధ్యక్షులు పి.సుగుణాకర్ రావు తెలిపారు. ఈ మేళాలో రైతులకు కొన్ని కంపెనీల విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రైతులకు తక్కువ ధరలో లభిస్తాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ ప్రదర్శన కార్యక్రమాలు ఉన్నందున జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News December 19, 2025
పంచాయితీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ భేష్

కరీంనగర్ జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసినందుకు కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు కలిసి అభినందించారు. ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ కాళీచరణ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
News December 19, 2025
వకుళాభరణం కృష్ణమోహన్ రావును అభినందించిన బండి సంజయ్

సామాజిక న్యాయం-GST సంస్కరణల నేపథ్యంలో ప్రత్యేక గ్రంథాన్ని రచించిన TG BC కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావును బండి సంజయ్ అభినందించారు. ఇటీవల ఢిల్లీలో ఆవిష్కృతమైన ఈ పుస్తకం సామాజికకోణంలో GSTని విశ్లేషించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ప్రధాని దార్శనికతకు GST సంస్కరణలు నిదర్శనమని, అట్టడుగువర్గాలకు మేలుచేసేలా ఉన్న ఈ అంశాలపై పరిశోధనాత్మక గ్రంథం తీసుకురావడం గొప్ప విషయమని బండి ప్రశంసించారు.


