News December 31, 2025

NEW YEAR సెలబ్రేషన్స్.. వరంగల్‌లో హైదరాబాద్ కల్చర్..!

image

వరంగల్‌కు మెట్రో కల్చర్ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి త్రినగరిలో హైదరాబాద్ తరహాలో మందు, విందు, డీజే మ్యూజిక్.. పేరొందిన సినీ సింగర్‌లతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడానికి ఈవెంట్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంకే నాయుడు, హంటర్ రోడ్డు డీ కన్వెన్షన్, భద్రకాళి బండ్, బీఎస్‌కే గ్రౌండ్, హనుమకొండలోని పలు హోటల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి.

Similar News

News January 3, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* ‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలంటూ TG అసెంబ్లీలో తీర్మానం
* రూ.7వేల Crతో HYDకు గోదావరి జలాలు: CM రేవంత్
* పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CM CBN
* ఫోర్బ్స్ డేటా.. FY-2026లో పెట్టుబడుల్లో AP టాప్
* కూటమి దౌర్జన్యాలను తిప్పికొడతాం: YS జగన్
* తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన BRS
* KCR సభకు రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్న కవిత

News January 3, 2026

ఆస్ట్రోనాట్స్‌కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

image

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్‌లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్‌పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.

News January 3, 2026

సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ నాగర్జున

image

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియామకమయ్యారు. వైద్య కళాశాల ప్రొఫెసర్ హెచ్‌ఓడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ వైస్ ప్రిన్సిపల్‌గా (అడ్మినిస్ట్రేటివ్ విభాగం ) నియమించారు.