News December 31, 2024
న్యూఇయర్ వేడుక.. పోలీసుల ప్రత్యేక ఆహ్వానం

లా అండ్ ఆర్డర్‌ను బ్రేక్ చేస్తూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునే వారిని ఉద్దేశించి పంజాబ్ పోలీసులు షేర్ చేసిన పోస్టర్ వైరలవుతోంది. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, రోడ్లపై తన్నుకోవడం, LAWను బ్రేక్ చేసిన వారికి స్పెషల్ ఆఫర్. సిటీ పోలీస్ స్టేషన్‌కు ఫ్రీ ఎంట్రీ. వారందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుంది. అలాంటివారెవరైనా కనిపిస్తే 112కి కాల్ చేసి మమ్మల్ని ఆహ్వానించండి’ అని రాసున్న పోస్టర్ షేర్ చేశారు.
Similar News
News February 6, 2026
U19 WC ఫైనల్: రికార్డులు కొల్లగొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో U19 WC ఫైనల్లో యువ భారత్ పలు రికార్డులు బద్దలు కొట్టింది.
*U19 WC ప్లే ఆఫ్స్‌లో 350+ స్కోరు చేసిన తొలి జట్టు.
*U19 WC చరిత్రలో 400+ స్కోర్లు ఏకంగా 3 సార్లు చేసింది.
*యూత్ ODIsలో 25 ఇన్నింగ్స్‌లలోనే <<19067167>>వైభవ్<<>> 110 సిక్సులు బాదారు. ఇంకెవరూ అతడి దరిదాపుల్లో లేరు.
*ఈ టోర్నీలో హయ్యెస్ట్ ఛేజింగ్ 311 పరుగులు. అది కూడా అఫ్గాన్‌తో సెమీస్‌లో ఇండియా నమోదు చేసింది.
News February 6, 2026
పత్తి అమ్మకాలకు “కపాస్ కిసాన్” యాప్‌లో నమోదు ఎలా?

“కపాస్ కిసాన్” యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.
News February 6, 2026
421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/


