News December 31, 2024

పవన్ అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం న్యూ ఇయర్ కానుక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోపై అతి త్వరలో అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్ రాబోతోందంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల కానుంది.

Similar News

News November 26, 2025

రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

image

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్‌కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News November 26, 2025

తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

image

SA క్రికెట్‌లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్‌ అయ్యారు. 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.

News November 26, 2025

‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

image

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్‌తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.